విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ప్రేరణ తరగతులు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ప్రేరణ తరగతులు

Feb 8 2026 4:07 AM | Updated on Feb 8 2026 4:07 AM

విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ప్రేరణ తరగతులు

విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ప్రేరణ తరగతులు

మాట్లాడుతున్న రామనాథం

నర్సీపట్నం: పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే ప్రేరణ తరగతుల ము ఖ్య ఉద్దేశమని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు రామనాథం తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పట్టణంలోని బాలికల వసతిగృహంలో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. టెన్త్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పదవ తరగతి విద్యా ర్థుల భవిష్యత్తుకు తొలిమెట్టని, దానిని అధిగమించి ఉన్నతవిద్యలో రాణించాలన్నారు. ఏమై నా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారి బాబూరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement