గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల/జూనియర్ కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. రత్నవల్లి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశానికి గాను జిల్లాలో ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. వయో పరిమితి ఎస్సీ, ఎస్టీ అయితే 2013 సెప్టెంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 31 తేదీల మధ్య, బీసీ, ఓసీలు అయితే 2015 సెప్టెంబర్ ఒకటి నుంచి 2017 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరాలంటే రెగ్యులర్ విధానంలో పదో తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 40 సీట్లు వంతున ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4.00 గంటల లోపు apbrafcet.apcfrr.inకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే తాళ్లపాలెం గురుకులం సిబ్బందిని సంప్రదించాలన్నారు.
జీవో 36 అమలు చేయకపోతే సమ్మె బాట


