2 మద్యం బార్లకు లైసెన్సుల మంజూరు | - | Sakshi
Sakshi News home page

2 మద్యం బార్లకు లైసెన్సుల మంజూరు

Feb 6 2026 7:40 AM | Updated on Feb 6 2026 7:40 AM

2 మద్యం బార్లకు లైసెన్సుల మంజూరు

2 మద్యం బార్లకు లైసెన్సుల మంజూరు

తుమ్మపాల : జిల్లాలో రెండు నోటిఫైడ్‌ బార్లకు 10 దరఖాస్తులు అందాయని, లాటరీ నిర్వహించి ఇద్దరు విజేతలను ఎంపిక చేసి, ప్రతి బార్‌కు ఆర్‌ 1, ఆర్‌ 2 రిజర్వ్‌ అభ్యర్థులను ఖరారు చేసామని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాలో ఎంపికై ెన అభ్యర్థులు రూ.13.75 లక్షల చెల్లించి తాత్కాలిక లైసెన్సును పొందారన్నారు. పూర్తి లైసెన్స్‌ ఫీజును ఆరు వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. రెండు, మూడో సంవత్సరాల్లో లైసెన్స్‌ ఫీజుపై ఏటా 10 శాతం పెంపు ఉంటుందన్నారు. లైసెన్స్‌దారులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, చట్టాలకు కట్టుబడి, నిర్ణీత ప్రాంగణాల్లోనే వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విక్రయాలు, నిబంధనల అమలుపై నిశిత పర్యవేక్షణ చేపడతామని, ఉల్లంఘనలు జరిగితే కఠినమైన శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ వి.సుధీర్‌, ఎఈఎస్‌ అధికారులు, ఆశావహులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement