డీఈఓకు మిడ్డే కార్మికుల సమ్మె నోటీసు
డీఈఓకు సమ్మె నోటీసు అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు
చోడవరం : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈనెల 12వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులంతా పాల్గొంటామని ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి తెలిపారు. దీనిలో భాగం సమ్మె నోటీసును సోమవారం జిల్లా విద్యాశాఖాధికారికి ఇచ్చామని ఆమె తెలిపారు. ఉద్యోగభద్రత, కనీస వేతనాలు అమలు, ప్రమాద బీమా సౌకర్యంతోపాటు ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలని కోరుతూ ఈ సమ్మె చేపడుతున్నామని ఆమె చెప్పారు. పాఠశాలల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇవ్వాలని, శానిటేషన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఎం. శ్రీదేవి, సూర్యలక్ష్మి,జానకి, శివలక్ష్మి పాల్గొన్నారు.


