
గురుకుల పాఠశాల విద్యార్థిని అదృశ్యం
నక్కపల్లి: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. పాఠశాల సిబ్బంది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఎం.రామతులసి దసరా సెలవులకు ఇంటి వెళ్లి మంగళవారం తిరిగి పాఠశాలకు వచ్చింది. అదే రోజు రాత్రి సుమారు పదిగంటల సమయంలో పాఠశాల గోడ దూకి బయటకు వెళ్లినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. రామతులసి ఇంటికి గాని, పాఠశాలకు గాని తిరిగి రాలేదు. పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.