
పోలీసులను తప్పించుకొని కోటవురట్ల మండలం నగరం వద్ద మామిడి తోటల్లో నుంచి బైకులపై వెళుతున్న అభిమానులు
సాక్షి నెట్‌వర్క్: ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలని, తమ బాధలు చెప్పుకోవాలని తండోపతండాలుగా వస్తున్న ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వందల సంఖ్యలో రంగంలోకి దిగిన పోలీసులు కార్లను, ఆటోలను ఆపి, అంతమంది వెళ్లడానికి వీల్లేదని ఆటంకపరిచారు. బైకుల మీద వెళుతున్నవారిని కూడా ప్రశ్నించారు.
చివరకు ఆర్టీసీ బస్సులు కూడా ఆపి వైఎస్ జగన్‌ను కలిసేందుకు వెళుతున్నారేమోనని ఆరా తీసి, అనుమతి లేదని దింపేశారు. అందుకే అనేక చోట్ల అభిమానులు తోటలు, పొలాల్లోంచి అడ్డదారిలో బైక్‌పై మాజీ సీఎంను చూసేందుకు వెళ్లారు.

కశింకోట మండలం నర్శింగబిల్లి కూడలి వద్ద ఆటోను అడ్డగిస్తున్న పోలీసులు

అనకాపల్లి సమీపంలో చోడవరం సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావును అడ్డగించిన పోలీసులు