
అభిమాన నేతకు అభివాదం
మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు జనం పోటెత్తారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమైన జనజాతర.. నర్సీపట్నం చేరేసరికి సముద్రంలా ఉప్పొంగింది. జై జగన్ అంటూ చేసిన నినాదాలతో జంక్షన్లు మార్మోగిపోయాయి. గోపాలపట్నం, వేపగుంట, చినముషిడివాడ, పెందుర్తి ప్రాంతాల్లో విశాలమైన బీఆర్‌టీఎస్ రహదారి కూడా జనసంద్రంగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు మండే ఎండలోనూ జగన్‌కు హారతులు పడుతూ.. పూలు జల్లుతూ, గజమాలలు వేస్తూ కరచాలనాలు చేశారు. అక్కడి నుంచి అనకాపల్లికి చేరుకున్న తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆకాశం చిల్లుపడినట్లు ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ వెనక్కు వెళ్లలేదు. ఆ జోరు వర్షంలోనే జగన్‌కు జేజేలు కొట్టారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు జగన్‌ను జనసునామీలా చుట్టేశారు. కాన్వాయ్ కదిలేందుకు కూడా వీలులేకుండా బారులు తీరారు. అభిమానంతో ఉరకలెత్తుతున్న ప్రజల్ని చూసి వైఎస్ జగన్.. అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నర్సీపట్నం చేరుకున్నాక జై జగన్ నినాదాలు మరింత మిన్నంటాయి. వైద్య కళాశాల వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు స్వాగతం పలికారు.

వర్షంలోనే మహిళలతో మాట్లాడుతున్న జగన్

అభిమాన నేతకు అభివాదం