
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
డాబాగార్డెన్స్: పచ్చకామెర్లతో బాధపడుతూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పార్వతీపురం జిల్లా కురుపాం మండలం శివన్నపేట గురుకులం ఆశ్రమ పాఠశాల హాస్టల్ విద్యార్థులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాత్రి పరామర్శించారు. కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న సుచిత్ర, లాస్య, స్మైల్, భవిష్య, మాధవి, కీర్తన, సాయి, ప్రణవి, గ్రీష్మ, విద్యా, రమ్య, సంజన, అశ్విని, ధరణి, అఖిల, దీపిక, నీహరిక తదితర పిల్లల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
కాసేపు పిల్లలతో ముచ్చటించారు. తాగునీరు, భోజనం బాగోలేదని విద్యార్థినులు చెప్పారు. ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలందర్నీ ఆప్యాయంగా పలకరించగా.. వారంతా సంతోషంగా వైఎస్ జగన్‌తో మాట్లాడారు.

విద్యార్థినులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి