
జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తూ న్యాయవాదులు నిరసన
నర్సీపట్నం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం బెంచ్‌ని బాయ్ కాట్ చేసి, నిరసన తెలిపారు. ఈ ఘటన జరగటం దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కె.అప్పలనాయుడు, జనరల్ సెక్రెటరీ శివకృష్ణ, కోశాధికారి వెంకటరమణ, న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటం దుర్మార్గమైన చర్య అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి అన్నారు. అబిద్‌సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని విమర్శించారనే నెపంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి చేశారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిపైనే దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెనకబడిన వర్గాలపై మతోన్మాదుల దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడి చేసినట్టేనన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వై.పాపారావు, గిరిజన సంఘ నాయకులు హరిప్రసాద్, తలుపులు, లోవరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తూ న్యాయవాదులు నిరసన