
ఏమ్మా.. ధరలు తగ్గాయా?
● కొత్త జీఎస్టీ శ్లాబ్ రేట్ల అమలుపై ఆరా
● డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లలో
అధికారుల తనిఖీలు
అనకాపల్లి: ఏమ్మా.. జీఎస్టీ శ్లాబ్ రేట్లు తగ్గాయి కదా... తగ్గిన ధరకే వస్తువులు ఇస్తున్నారా? ధరలు తగ్గాయన్న సమాచారం మీకు తెలుసా.. అంటూ తూనికలు, కొలతల శాఖ జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ బి.రామచంద్రయ్య పట్టణంలోని పలు డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లలో కొనుగోలుదారులతో మాట్లాడారు. డీమార్ట్, మోర్ తదితర స్టోర్స్‌లలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీఎస్టీ 2.0 అమలుకు ముందు, సెప్టెంబరు 22 తర్వాత ధరల తేడాను వినియోగదారులకు వివరించారు. షాపులవారు ముందుగా కొనుగోలు చేసిన సరకులపై కొత్త ఎంఆర్‌పీలను ప్రకటించాలన్నారు. వ్యాపార సంస్థలు జీఎస్టీ సవరణ తేదీకి ముందు తయారు చేసిన అమ్ముడుపోని స్టాక్‌పై ఉన్న ఎంఆర్‌పీని సవరించవచ్చని, అయితే అసలు ఎంఆర్‌పీ తప్పనిసరిగా చూపించాలన్నారు. కన్స్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జీఎస్టీ సంస్కరణలు మిశ్ర మంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. తూని కలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ వేలమూర్తి రామారావు, కన్స్యూమర్ రైట్స్ సేఫ్ గార్డింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, రాంబిల్లి వినియోగదారుల మండలి అధ్యక్షుడు ఎస్.నూకరాజు (రాంబిల్లి), కన్స్యూమర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నందవరపు సంజీవరావు (బుచ్చెయ్యపేట), బొడ్డేడ జగ్గప్పారావు (మునగపాక) పాల్గొన్నారు.