
అనకాపల్లి జిల్లా : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మాకవరపాలెం మెడికల్ కాలేజీలో పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. ఏకంగా జగన్ కార్వాన్ మీదకు జనం ఎక్కినా పోలీసులు పట్టించుకోలేదు. జనం ఇలా కార్వాన్ మీదకు ఎక్కినా పోలీసులు మాత్రం చోద్యం చూశారు. ఈ పర్యటనలో మధ్మాహ్నం నుండి వర్షంలో తడుస్తూ వచ్చారు వైఎస్ జగన్.
కార్వాన్ లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకునేందుకు కూడా వైఎస్ జగన్ అవకాశం లేకుండా పోయింది. జనాన్ని అదుపు చేయకుండా వదిలేశారు ఖాకీలు. ప్రెస్‌మీట్ సమయంలోనూ గ్యాలరీలోకి జనాన్ని పంపారు పోలీసులు. దాంతో జగన్ మాట్లాడే సమయలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసుల కారణంగా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కొందరు ఖాకీలు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. మరొకవైపు వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో పార్టీ కేడర్‌లో ఫుల్‌జోష్ నెలకొంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం