
విశాఖపట్నం: గాజువాకలోని ఒక స్పా సెంటర్‌పై గాజువాక పోలీసులు, సిటీ టాస్‌్కఫోర్స్ సిబ్బంది శనివారం దాడి చేశారు. అందులో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు. పాతగాజువాకలోని సీఎంఆర్ సెంట్రల్‌కు సమీపంలోని ఎస్‌ఎస్ థాయ్ స్పా సెంటర్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాజువాక పోలీసులతో కలిసి దాడి చేశారు.
అక్కడ వ్యభిచారం జరుగుతుండటంతో స్పా సెంటర్ నిర్వాహకురాలు సహా ఒక విటుడిని అరెస్టు, ఐదు గురు బాధితులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు గాజువాక సీఐ పార్థసారధి తెలిపారు. జోన్–2 టాస్‌్కఫోర్స్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఎస్‌ఐ భరత్, సిబ్బంది పాల్గొన్నారు.