
సాక్షి, నర్సీపట్నం: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్ జగన్.. చంద్రబాబు చేస్తున్న ప్రైవేటీకరణ కుట్రలను ఎండగట్టారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే.. ఈరోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..
గత మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం
ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీ చేస్తే.. తట్టుకోవడం పేదవాళ్లకు అసాధ్యం
అందుకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది
అలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు.
అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా?
పేదవారు దగా పడకుండా ఎలా ఆపుతారు
పేదవాళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చాం
నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం
కోవిడ్ సంక్షోభంలోనూ రూ.500కోట్లు ఖర్చు చేశాం
ఈ మెడికల్ కాలేజీలో పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేది
ఏడాదికి 150 మెడికల్ కాలేజీ సీట్లను అందుబాటులోకి తెచ్చాం
అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది
చంద్రబాబు పేదవాడికి అన్యాయం చేస్తున్నారు
విజయనగరం,పాడేరు మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభమయ్యాయి
చంద్రబాబును అడుగుతున్నాం.. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీల పరిస్థితుల ఇవి
ఈ నాలుగు మెడికల్ కాలేజీ కాకా.. ఐటీడీఏ పరిధిలోని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి
పలు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తయ్యియి
17 మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి కనిపించింది.
అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో 2023-24 క్లాసులు ప్రారంభమయ్యాయి.
పేదవాళ్లు చదువుకునేందుకు, మెడిసిన్ చదివేందుకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి
అలాంటి కోట్లాది మందికి వైద్యం,విద్య అందించే ఆధునిక దేవాలయాల్ని దగ్గరుండి చంద్రబాబు అమ్మేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
మొత్తం మెడికల్ కాలేజీలకు ఐదేళ్లలో ఐదుకోట్లు.. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? చంద్రబాబు
అమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి.. అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి,కరెంట్,నీళ్లు ఇవ్వడానికి మొత్తం యాభైవేల ఎకరాలు.. ఎకరాకు రెండు కోట్లు చొప్పున మొత్తం లక్షకోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలకు రూ. రూ. 4,500 కోట్లు ఖర్చు చేయలేరా?
ఇప్పుడు యాభైవేల ఎకరాలు సరిపోవు.. మరో యాభైవేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారు
ఇలా అమరావతి మొత్తంగా లక్ష ఎకరాలు.. రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూ.. 70వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం అని చెప్పుకుంటూ.. కోట్లాది మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు,ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు..ఏడాదికి వెయ్యికోట్లు ఐదేళ్లకు ఐదువేల కోట్లు ఖర్చు పెట్టలేక.. ప్రైవేట్ పరం చేస్తున్నారా? చంద్రబాబు.

అయ్యన్నపాత్రుడుకి వైఎస్ జగన్ కౌంటర్!
- అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం
- ఇందులో భాగంగా నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నేత,ఎమ్మెల్యే,స్పీకర్ చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు
- అబద్ధాలు చెబుతూ.. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులే ఎక్కువే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. రుజువు చేసుకుంటున్నారు
- దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు బుద్ధిరావాలి’ అని యాజిటేషన్ కార్యక్రమం చేస్తున్నాం.
- ఇదే నర్సీపట్నం నేత,స్పీకర్‌కు చెబుతున్నాను.. అబద్ధాలు చెప్పడం,మోసం చేయడం,ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం.
- ఈమెడికల్ కాలేజీలకు జీవో ఎక్కడుందని అడుగుతారా?.. ఇదిగో జీవో నెంబర్ 204
- స్పీకర్ పదవిలో ఉండి జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి మీరు అర్హులేనా? అని ఆలోచన చేయండి.
- తప్పుడు మాటలు చెబుతూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుకు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తలదించుకోవాలి
- ఇదే పెద్దమనిషి చంద్రబాబు 2024 జూన్‌లో అధికారంలోకి వస్తే..సెప్టెంబర్ 3న మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు ఆపమని ఓ మోమో డిక్లేర్ చేశారు.
వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం
- మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణు వైఎస్ జగన్ పిలుపు
- అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ,సంతకాల సేకరణ
- అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
- నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు
- నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు
- నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు
- గవర్నర్‌కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత