
9న జగనన్న దృష్టికి ‘గోవాడ సుగర్స్’ దుస్థితి
మాడుగుల రూరల్: ఈ నెల 9న జిల్లా పర్యటనకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ దుస్థితిని తీసుకెళ్లనున్నట్టు చోడవ రం సీడీసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన కె.జె.పురంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ సూర్యనారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల సందర్శనకు వస్తున్న వైఎస్ జగన్‌కి సుగర్ ఫ్యాక్టరీ దుస్థితిపై వినతిపత్రం అందజేస్తామన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి రూ.90 కోట్లు మంజూరు చేసి, ఆర్థికంగా ఆదుకున్న ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుతం సభ్య రైతులకు గడిచిన క్రషింగ్‌లో ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు పేమెంట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభు త్వం ఉందని ఆరోపించారు. జీతాలు లేక కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల నాయకులు, రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి
సుంకర శ్రీనివాసరావు