
సారా నిర్మూలనకు ‘నవోదయం’
నర్సీపట్నం: ఉమ్మడి జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా మార్చడమే ఎకై ్సజ్‌శాఖ ముఖ్య ఉద్దేశమని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. సోమవారం ఆయన నర్సీపట్నం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం తీ సుకువచ్చిన నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా సా రా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నా రు. గంజాయి సాగు, రవాణా కట్టడిపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పోలీసు, రెవెన్యూశాఖల సమన్వయంతో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. 142 బార్లకు కేవలం 68 దర ఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
ఎకై ్సజ్ స్టేషన్‌లో సోమవారం గంజాయి కేసుల్లో పట్టుబడిన నాలుగు బైక్‌లను వేలం వేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో జీఎస్టీతో కలిపి మొత్తం రూ.15,930 ఆదాయం సమకూరింది.
ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి