
ఎస్పీ కార్యాలయంలో 52 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు సోమవారం 52 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూ సమ్యలు, కుటుంబ కలహాలుపై ఎక్కువగా అర్జీలు వచ్చాయన్నారు. భూ సమస్యలపై–32, కుటుంబ కలహాలు–5, మోసాలకు సంబంధించినవి–3, ఇతర విభాగాలివి–12 అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌ఐలు మల్లేశ్వరరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.