
ఏకగ్రీవ సర్పంచ్‌లకు ప్రోత్సాహకాలేవీ?
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నుకోబడ్డ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని కోరుతూ చీడికాడ మండలం జేబీపురం, దండిసురవరం, శిరిజాం, పెదగోగాడ, అడవి అగ్రహారం గ్రామాల సర్పంచ్‌లు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తాము సర్పంచ్‌లుగా ఎన్నికై నాలుగేళ్ల 6 నెలలు పూర్తయినా ఇంతవరకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని వాపోయారు. తక్షణమే నిధులు మంజూరు చేయాలంటూ కలెక్టర్‌ను ఆయా గ్రామాల సర్పంచ్‌లు గొల్లవిల్లి చినమ్మలు, కోన అర్జున, కె.సత్యవతి, పి.అచ్చియమ్మ, సలాది లక్ష్మి కోరారు.