
పూర్ణాహుతితో ముగిసిన బ్రహోత్సవాలు
జమ్మిచెట్టుకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
స్వామివారి ఉంగరం తీశారని భక్తుల విచారణ
నక్కపల్లి: ఉపమాక శ్రీకల్కి వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో విజయదశమి పురస్కరించుకుని గురువారం శమీ పూజ, మహా పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. చూర్ణోత్సవం, దర్పణ సేవ జరిగిన తర్వాత స్వామి వినోదోత్సవం నిర్వహించారు. స్వామివారి ఉంగరం పోయిందని భక్తులను విచారించడం, వారు అవాక్కవ్వడం, చివరకు స్వామివారి పాదాల వద్ద ఉంగరం పడి ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకోవడం వినోదంగా సాగింది. బంధుర సరస్సు వద్ద భక్తుల గోవింద నామస్మరణల మధ్య సుదర్శన పెరుమాళ్లతో చక్రవారీ స్నానం నిర్వహించారు. వాతావరణం అనూకూలించకపోవడంతో శమీ పూజను ఆలయంలోనే ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవను పునఃప్రారంభం చేశారు. పది రోజులపాటు జరిగిన స్వామివారి బ్రహోత్సవాలు గురువారం రాత్రితో సంపూర్ణమయ్యాయని ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు చెప్పారు.

పూర్ణాహుతితో ముగిసిన బ్రహోత్సవాలు