
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
రావికమతం: మండలంలోని చినపాచిలి పంచాయతీ శివారు మత్స్యపురంలో గురువారం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలో ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మామిడి దేవుడు అనే వ్యక్తి ఇంటిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటలతో పాటు దట్టంగా పొగ వ్యాపించింది. కొందరు యువకులు సాహసించి ఇంటిలో గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫ్రిజ్, టీవీ, ఫ్యాన్లు, స్టౌ, వంట ప్రాతలు దగ్ధమయ్యాయి.అందిన సమాచారం మేరకు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి, మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో రూ.లక్ష ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా.