
చిక్కుడుపాలెం శివాలయంలో శుభలేఖ సుధాకర్ పూజలు
నాతవరం: మండలంలో చిక్కుడుపాలెంలో వెలిసిన శివ శక్తి భూగర్భ శివాలయంలో గురువారం సినీనటుడు శుభలేఖ సుధాకర్ ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్భంగా ఆయన ఈ శివాలయాన్ని సందర్శించి, ఇక్కడ శివలింగాలకు స్వయంగా అభిషేకం చేశారు. అనంతరం శుభలేఖ సుధాకర్‌ను ఆలయ నిర్మాణ కర్త కె.ఎస్.ఎన్. శర్మ ఘనంగా సత్కరించారు.ఈసందర్భంగా శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఇంతటి గొప్ప శివాలయం నిర్మించడం విశేషమన్నారు. భూగర్భంలో ప్రతిష్టించిన శివలింగాలను చూసి చాలా ఆనందం కలిగిందని చెప్పారు. శుభలేఖ సుధాకర్‌ను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. పలువురు ఆయనతో ఫొటోలు తీసుకున్నారు.