
ఘనంగా భగీరథమ్మ మహోత్సవాల ముగింపు
● ఆకట్టుకున్న గంగాహారతి
● వైభవంగా శూలాల మహోత్సవం
● దీపాలంకరణతో వెలుగులు
అచ్యుతాపురం: మండలంలోని హరిపాలెం అందలాపల్లిలో భగీరథమ్మ దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భగీరథమ్మ కొండ ఆధ్మాత్మిక సందడితో దేదీప్యమానంగా వెలుగులీనింది.గురువారం అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు.సాయంత్రంలో భక్తులు శూలాలు ధరించి ఊరేగింపు నిర్వహించారు. అగ్నిగుండం తొక్కిన తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆవకాలువ మదుంపై నిర్వహించిన గంగాహారతి ఆకట్టుకుంది.
పలు చోట్ల అమ్మవారి ఉత్సవాలు...
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని హరిపాలెంలో శూలాల మహోత్సవం ఘనంగా జరిగింది.తిమ్మరాజుపేటలో భక్తులు శూలాలు ధరించి ఉత్సవంలో పాల్గొన్నారు.అచ్యుతాపురంతో పాటు జగన్నాథపురం తదితర గ్రామాల్లో దసరా ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా భగీరథమ్మ మహోత్సవాల ముగింపు