
గుర్తు తెలియని వాహనం ఢీ
యాచకుడు దుర్మరణం
మర్రిబంద హైవే కూడలి సమీపంలో
యాచకుడు మృతదేహం
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద హైవే కూడలికి సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ కూడలిలో ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం వద్ద 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న బిచ్చగాడు నడిచి వెళ్తుండగా, అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్లే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రేగుపాలెం వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు యలమంచిలి పట్టణ ఎస్సై కే సావిత్రి తెలిపారు.