
పోగొట్టుకున్న మొబైల్ అందజేత
నాతవరం: ఆర్టీసీ బస్సు ప్రయాణంలో పోగొట్టుకున్న మొబైల్‌ను స్థానిక పోలీసు స్టేషన్లో బాధితురాలికి అందజేసినట్టు ఎస్‌ఐ వై. తారకేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... నాతవరం గ్రామానికి చెందిన లక్కోజు మాధవి తన పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో నర్సీపట్నం వెళ్తుండగా రూ. 25 వేలు విలువ చేసే మొబైల్‌ను పోగొట్టుకుంది. ఈ విషయమై వెంటనే ఆమె నాతవరం ఎస్‌ఐకు సమాచారం ఇచ్చింది. నాతవరం క్రైమ్ కానిస్టేబుల్ పి.కిశోర్ అనకాపల్లి జిల్లా పోలీసు టెక్నికల్ టీమ్‌తో కలిసి పోగొట్టుకున్న మొబైల్ ప్రాంతాన్ని గుర్తించారు. బాధితురాలు అన్నయ్య దుర్గాప్రసాద్‌తో కలిసి కాకినాడ జిల్లా తుని మండలం నందిపూడిలో ఒక వ్యక్తి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. దాన్ని బాధితురాలికి అప్పగించారు. గంటల వ్యవధిలో మొబైల్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్న క్రైమ్ కానిస్టేబుల్ కిశోర్‌ను ఎస్‌ఐ అభినందించారు.