
పారా వాలీబాల్ వరల్డ్‌కప్‌కు ఎంపిక
గణేష్‌ను సత్కరిస్తున్న దృశ్యం
ఎస్.రాయవరం : పారా వాలీబాల్ వరల్డ్ కప్‌కు ఎంపికై న సోమిదేవపల్లి గ్రామానికి చెందిన అన్నం గణేష్‌ను శ్రీపజ్ఞా జూనియర్ కళాశాల యాజమాన్యం శనివారం ఘనంగా సత్కరించింది. ఈ కళాశాలలో పూర్వ విద్యార్థి అయిన గణేష్ వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం అభినందనీయని ప్రిన్సిపాల్ రాము అభినందించారు. గణేష్‌ను దుస్సాలువాతో సత్కరించి, రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. కళాశాల ఉపాధ్యాయులు జోగినాథం, రమేష్, ప్రకాష్,రాజు తదితరులు పాల్గొన్నారు.