
అగ్రి సెట్ ఫలితాల్లో ర్యాంకుల పంట
స్టేట్ ప్రథమ ర్యాంకు సాధించిన రాజేష్
నర్సీపట్నం: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025వ సంవత్సరానికి సంబంధించి అగ్రి సెట్ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో బి.ఆర్.పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల విద్యార్థి ఎస్.రాజేష్ విత్తన సాంకేతిక టెక్నాలజీ విభాగంలో 105 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. బి.బిందుశ్రీ 7వ ర్యాంక్, వీలమ్‌శ్రావణి 8వ ర్యాంకు, జి.సాయికుమార్ 15, జి.నాగలక్ష్మి 18వ ర్యాంకు సాధించారు. వ్యవసాయ డిప్లొమా విభాగంలో ఇ.భానుప్రకాష్ 105వ ర్యాంకు, ఎస్.రాజేష్ హర్షవర్ధన్ 109, బి.ఝాన్సీదేవి 131, ఎస్.యోగేంద్రనాయుడు 133, జి.వెంకట నవీన్ 140వ ర్యాంకు సాధించారు.