
యాసిడ్ లారీని ఢీకొట్టిన బస్సు
గ్యాస్ లీక్ ● సకాలంలో రక్షణ చర్యలు
నక్కపల్లి: జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి తుని వైపు సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో వెళ్తున్న లారీ రిపేరు రావడంతో డ్రైవరు టోల్‌గేట్ సమీపంలో రోడ్డు మధ్యలో నిలిపివేశాడు. లారీలో యాసిడ్ ఉన్న విషయం తెలిసినప్పటికీ డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. లారీ పక్కన నిలబడి హెచ్చరించడం, అడ్డంగా ఏదైనా వస్తువులు సైతం పెట్టలేదు. లారీని పక్కన ఆపేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదే సమయంలో విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆగి ఉన్న యాసిడ్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదేవిధంగా యాసిడ్ లారీ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై ంది. దీంతో రహదారిపై రాకపోకలు సాగించేవారు చాలా భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వెళ్లి గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.

యాసిడ్ లారీని ఢీకొట్టిన బస్సు