
ప్రజాస్వామ్యం ఖూనీ
కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి. వాటిపై కనీస ధ్యాస లేదు. ప్రజా సమస్యల్ని, ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజా పక్షాన పోరాడే పత్రికలపై, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు సరికాదు. పత్రికలపై, జర్నలిస్టులపై అక్రమ కేసులతో పత్రికాస్వేచ్ఛను హరిస్తామంటే ప్రజాస్వామాన్ని ఖూనీ చేసినట్లే. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను చూపించే సాక్షి పత్రికపై అక్రమ కేసులు నమోదుచేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి మీడియా సమావేశం పెడితే అది వార్తగా ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు.
– మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే

ప్రజాస్వామ్యం ఖూనీ