
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు గ్రౌండ్ పరిశీలన
గొలుగొండ: వచ్చేనెల 5,6,7 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఏఎల్‌పురం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌ను బుధవారం నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 26 జట్లు ఈ పోటీల్లో పాల్గోనున్నట్టు తెలిపారు. క్రీడాకారులకు తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాతవరం, గొలుగొండ ఎస్‌ఐలు తారకేశ్వరరావు, రామారావుతో పాటు స్కూల్ కమిటీ చైర్మన్ రాజు, హెచ్‌ఎం కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.