
గోసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
పాయకరావుపేట: దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా గోసంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు, అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యదర్శి కృష్ణ చరణానంద భారతి స్వామి అన్నారు. స్థానిక కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన హిందూ సనాతన ధర్మ మహాసభలో ప్రసంగించారు. ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, గోవధను నిషేధించాలని, హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ఆక్రమణలకు గురైన ఆలయ భూములను దేవాలయాలకు అప్పగించాలన్నారు. సభ ప్రారంభానికి ముందు పాండురంగ దేవస్థానం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా పాదయాత్ర చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.