
అమల్లో.. రెడ్ బుక్ రాజ్యాంగం
ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అనుసరించడం లేదు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న ఈ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీసే సాక్షి పత్రిక, టీవీ జర్నలిస్టులపై, సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేసే కుట్రలకు పాల్పడుతోంది. ఒక రాజకీయ నాయకుడి ప్రెస్‌మీట్‌ను వార్తగా రాస్తే కేసు ఎలా నమోదు చేస్తారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రెస్‌మీట్‌ల ద్వారా వెల్లడించిన అంశాలను వార్తగా మలిచే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది. అంతమాత్రాన జర్నలిస్టులకు, ఆ పత్రికలకు వాటిని ఆపాదించి కేసులు వేయడం సరికాదు. – మొల్లి అప్పారావు, విశాఖ తూర్పు సమన్వయకర్త