
బీఎన్ రోడ్డులో కూరుకుపోయిన వాహనాలు
బుచ్చెయ్యపేట భీమునిపట్నం, నర్సీపట్నం(బిఎన్) రోడ్డులో రోజు రోజుకు ప్రయాణీకులు కష్టాలు ఎక్కువవుతన్నాయి. కూటమి ప్రభుత్వం వస్తే రోడ్డు బాగుపడుతుందని ఆశపడ్డ ప్రజలికి ఆడియాశలే మిగిలేయి. బుధవారం బంగారుమెట్ట, ఎల్‌బీ పురం గ్రామాల మధ్యన పెద్ద గోతిలో నల్లరాయిని తీసుకెళ్తున్న లారీ బురదలో కూరుకుపోయింది. మూడు పొక్లెయిన్‌ల సాయంతో బయటకు లాగినా లారీ బయటకు రాలేదు. తెల్లవారుజామున దిగిపోయిన లారీ మధ్యాహ్నం 11 గంటలు వరకు బురదలోనే ఉండిపోయింది. దీంతో నర్సీపట్నం, వడ్డాది రహదారిలో తిరిగే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు కిలోమీటర్లు మేర నిలిచిపోయాయి. ఉద్యోగులు, విద్యార్ధులతో పాటు అత్యవసర పనులపై వెళ్లే వాహనదారులు అవస్ధలు పడ్డారు.