● అరకువ్యాలీలో నిర్వహణ
● కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : ఈనెల 24 నుంచి వచ్చేనెల ఒకటి వరకు నేషనల్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ క్యాంప్ అరకువ్యాలీలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో, డీఎఫ్‌వో, డీఎంహెచ్‌వో, డీపీఆర్వో, సర్వ శిక్ష ఏపీసీలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రెక్కింగ్ క్యాంప్‌ను 13వ ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సీసీ నిర్వహిస్తుందన్నారు. పలు రాష్ట్రాల నుంచి 565 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు రానున్నట్టు చెప్పారు. ఈ క్యాంప్ నిర్వాహణ కోసం నోడల్ అధికారిగా సర్వ శిక్ష ఏపీసీ స్వామినాయుడును నియమించామన్నారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈనెల 24 నుంచి వచ్చేనెల ఒకటి వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ అభిషేక్ గౌడ, ఎస్పీ అమిత్‌బర్దర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, 13వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ నీరాజ్‌కుమార్, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, డీపీఆర్వో బాల్‌మాన్‌సింగ్ పాల్గొన్నారు.