
పేదలకు లేటెస్ట్ కాస్మోటాలజీ సేవలు
కేజీహెచ్‌లో డెర్మటాలజీకి నూతన పరికరాలు
మహారాణిపేట: కేజీహెచ్ డెర్మటాలజీ విభాగం రోగులకు శుభవార్త అందించింది. అత్యాధునిక చర్మ, సౌందర్య సమస్యలకు ఉచిత చికిత్స అందించేందుకు రూ. 45 లక్షల విలువైన క్యూ–స్విచ్డ్ ఎన్డీ–వై ఏజీ లేజర్ యంత్రాన్ని కొను గోలు చేసింది. ఈ లేజర్ యంత్రాన్ని ప్రభుత్వం ద్వారా సమకూర్చారని, దీంతో పాటు మరికొన్ని ఆధు నిక యంత్రాలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా లభించా యని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సి పల్ డాక్టర్ కేవీఎన్‌ఎం సంధ్యాదేవి తెలిపా రు. ఈ కొత్త పరికరాలతో పేదలకు కూడా అధునాతన కాస్మోటిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న అత్యాధునిక సేవలు
లేజర్ చికిత్సలు: కేజీహెచ్ డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ టి. శాంతి మాట్లాడుతూ.. ఈ కొత్త లేజర్ యంత్రం ముఖ్యంగా మంగు మచ్చలు, మొటిమల మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఈ సమస్యలకు చికిత్స అందించవచ్చని తెలిపారు. రోజేసియా, స్టెరాయిడ్స్ వాడకం వల్ల ఏర్పడిన మచ్చలను కూడా ఈ లేజర్‌తో సురక్షితంగా తొలగించవచ్చని వివరించారు.
జుట్టు, చర్మ సంరక్షణ: అనవసరమైన హెయిర్ తొలగింపు, బొల్లి , సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు ‘నారో బ్యాండ్ ఫోటోథెరపీ’తో కాంతి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
జుట్టు ఎదుగుదలకు చికిత్సలు: జుట్టు రాలడం సమస్య ఉన్నవారికి ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో లెవల్ లైట్ థెరపీ ద్వారా చికిత్సలు కూడా ఉచితంగా అందిస్తున్నామని డాక్టర్ శాంతి తెలిపారు.
ఈ ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా కేజీహెచ్ చర్మ చికిత్సల విభాగం మరింత బలోపేతం అయిందని, దీనివల్ల పేద, మధ్యతరగతి రోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఫ్రాక్షనల్ సీవో 2 మిషన్
నారో బ్యాండ్ ఫోటోథెరపీ మెషీన్
ఎన్‌బీ యువీబీ
క్యూ స్వీచ్డ్ ఎన్‌డీ.వైజీ మిషన్

పేదలకు లేటెస్ట్ కాస్మోటాలజీ సేవలు

పేదలకు లేటెస్ట్ కాస్మోటాలజీ సేవలు

పేదలకు లేటెస్ట్ కాస్మోటాలజీ సేవలు