
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
మాడుగుల రూరల్: విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న రణభేరి బైక్ జాత గురువారం ఘాట్‌రోడ్డు జంక్షన్‌కు చేరుకుంది. ఈ జాత అల్లూరి సీతరామరాజు జిల్లా నుంచి ఘాట్‌రోడ్డు జంక్షన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని కోరారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి. చంద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57 ను రాష్టంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం ద్వారా రణభేరి మోగించాలని నిర్ణయించినట్టు రాష్ట నాయకులు ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా పలు మండలాలు నుంచి వచ్చిన ఉపాధ్యాయులు నినాదాలు చేస్తూ ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శరగడం జగ్గారావు, యూనియన్ నాయకులు ఎస్.ఎస్. నాగమణి, గంజి నాగేశ్వరావు, రమేశ్, కృష్ణ, నారాయణ, అప్పారావు, రవికుమార్, ఆనంద్, కామరాజు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు