
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
పరవాడ: పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం శివారులోని జాలారీపేట గ్రామంలో బుధవారం జరిగిన హత్య కేసులో నిందితుడు ఒలిశెట్టి కొదండను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఆర్. మల్లికార్జునరావు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ బుధవారం ఉదయం 9 గంటల సమయంలో కొదండ.. గొడవపడి తన భార్య లక్ష్మి (45)ని కత్తితో పొడిచి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.గురువారం నిందితుడు కొదండ వెన్నలపాలెం సినిమా హాలు కూడలిలో సంచరిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అనకాపల్లిలోని 11వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించగా.. విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్టు సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు.