
ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థల పరిశీలన
కశింకోట: మండలంలోని మూడు ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద ప్‌లై ఓవర్ వంతెనలను నిర్మించడానికి అవసరమైన భూముల సేకరణ కోసం గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. కశింకోట, నరసింగబిల్లి, ఎఎస్ పేట రైల్వే గేట్లను ఈ సందర్భంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్‌లై ఓవర్ వంతెనల నిర్మాణానికి సేకరించాల్సిన భూముల వివరాలపై ఆరా తీశారు. భూముల వివరాలు సేకరించి నివేదించిన తర్వాత ప్‌లై ఓవర్ వంతెనల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయిషా, తహసీల్దార్ సిహెచ్ తిరుమలరావు, మండల సర్వేయర్ ధనుంజయ, రైల్వే ఏజెన్సీ ప్రతినిధులు, విఆర్‌ఒలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.