
కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల నిరసన
డీఆర్వోకు వినతిపత్రం అందిస్తున్న ఉపాధ్యాయులు
తుమ్మపాల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాణ త్రినాథ్, జిల్లా అధ్యక్షుడు కె.కె.ఎల్.ఎన్. ధర్మారావు మాట్లాడుతూ 12వ పీఆర్‌సీని నియమించి, ఐఆర్ ప్రకటించాలని, ఈహెచ్‌ఎస్ పరిమితి రూ.25 లక్షలకు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తగ్గించి, బోధనకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పెండింగ్ డీఏల విడుదల, మెమో నంబర్ 57 అమలు తదితర పలు అంశాలపై డీఆర్వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, సభ్యులు మహాలక్ష్మి నాయుడు, బి.దేముడు బాబు, కె.విజయ పాల్గొన్నారు.