
రేషన్ షాపులకు అధునాతన ఇ–పోస్ యంత్రాలు
తుమ్మపాల: చౌక ధరల దుకాణాలకు అధునాతన ఇ–పోస్ యంత్రాలను సరఫరా చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, డీలర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు జిల్లాలో 1,069 చౌకధరల దుకాణాలకు అధునాతన ఇ–పోస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్ రేషను కార్డుల పంపిణీ సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంపిణీ అధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు.