
●భవభయ హారిణి.. పాప విమోచని..
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి దేవాలయాలు కళకళలాడాయి. ఎంతటి కష్టంలో ఉన్నా తల్లి మోము చూస్తే ప్రశాంతత కలుగుతుంది. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అందుకే జిల్లాలోని అమ్మవారి గుడులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కె.కోటపాడులోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 10 వేల గులాబీ పువ్వులతో పుష్పార్చన జరిపారు. అనకాపల్లి గవరపాలెంలో ఉత్తరాంధ్రుల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి బాలాలయంలో మహిళా భక్తులతో ఉచితంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గవరపాలెం సంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని శాకంబరి దేవిగా ఆలయ అర్చకులు అలంకరించారు.
కె.కోటపాడు/అనకాపల్లి

●భవభయ హారిణి.. పాప విమోచని..