
గ్రామాల్లో వైద్య సేవల కొరత
మా గ్రామంలో గత నెల రోజులుగా ప్రతి ఇంటిలో ఇద్దరు ముగ్గురు డెంగ్యూ, చికున్ గున్యా జ్వరాల బారిన పడుతున్నారు. నాతో పాటు మా ఇంటిలో నలుగురికి జ్వరం వచ్చింది. మా పెద్ద పాపకు ఎనిమిదేళ్లు, చిన్న పాపకు ఐదేళ్లు. ఇద్దరికీ చికున్ గున్యా జ్వరం వచ్చింది. గ్రామమంతా అనారోగ్యంతో బాధపడుతుంటే మెడికల్ సిబ్బంది వచ్చి చికిత్స అందించిన దాఖలా లేదు. దోమల మందు కొట్టించమని గ్రామ సెక్రటరీని వేడుకుంటే కనీసం పట్టించుకోలేదు.
– లగుడు శ్రీను, విప్పలపాలెం,
గొలుగొండ మండలం