
వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు
అనకాపల్లి టౌన్ :
మండలంలోని గోపాలపురం గ్రామంలో ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదైంది. ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాలివి. గొర్లి నాగేశ్వరావు(28) అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం తీవ్రంగా కడుపు నొప్పి వస్తుండంతో పేగు సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి నొప్పి తగ్గలేదని ఇంటిలో ఎవరితోనూ సరిగా మాట్లాడక పోవడం, ఇంటిలో అయోమయంగా ఉండేవాడన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుంచి ఫోన్ తీసుకువెళ్లకుండా, తన ద్విచక్రవాహనంతో బయటకు వెళ్లి మరళా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.