
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
● హెచ్‌పీసీఎల్–ఎస్‌డీఐతో ఎల్జీ ఇండియా ఒప్పందం
మహారాణిపేట: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎల్జీ ఇండియా సీఎస్సార్ ఫౌండేషన్, హెచ్‌పీసీఎల్–ఎస్‌డీఐ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని హెచ్‌పీసీఎల్ కార్యాలయంలో శుక్రవారం ఇరు సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా స్వల్ప, మధ్యకాలిక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అందిస్తారు. ఈ శిక్షణ ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణ సామర్థ్యం పెరుగుతాయని ఎల్జీ ఇండియా సీఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ గిరిజా శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి, సురక్షిత భవిష్యత్తు అందించడమే లక్ష్యమని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు, స్వయం ఉపాధి శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎల్జీ ఇండియా గ్లోబల్ హెడ్ పాల్ క్వాన్, ఎల్జీ గ్రూప్ డైరెక్టర్ సి.కె.జియాంగ్, హెచ్‌పీసీఎల్–ఎస్‌డీఐ సీఈవో ఇంతియాజ్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు సేవల్లో ఒకే కుటుంబం