
‘వీరమల్లు’కు రూల్స్ వర్తించవా?
● రోడ్డుకు అడ్డుగా పవన్ కల్యాణ్ కటౌట్
అనకాపల్లి టౌన్: పట్టణంలోని రామచంద్ర థియేటర్ జంక్షన్‌లో హరిహర వీర మల్లు సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు సినీ హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్‌తో ఏర్పాటు చేసిన ట్రాలీ బండి రోడ్డుకు అడ్డంగా ఉంది. దీనిని ఈ నెల 24న సినిమా రిలీజ్ సందర్భంగా ఊరేగింపుతో తీసుకువచ్చి వదిలేశారు. ఐదు రోజులుగా రోడ్డుకు అడ్డుగా ఉన్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ఈ కటౌట్ వల్ల అటువైపుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సెంటర్‌లో నిత్యం పండ్ల బళ్లు పెట్టుకొని పలువురు చిరువ్యాపారులు జీవనోపాధి పొందుతుంటారు. సామాన్యుడిపై జులుం ప్రదర్శించే ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకు అడ్డుగా అభిమానులు ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎందుకు తొలగించడం లేదని జనం విమర్శిస్తున్నారు.