యోగాంధ్రకు సర్వం సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రకు సర్వం సన్నద్ధం

Jun 17 2025 5:10 AM | Updated on Jun 17 2025 5:10 AM

యోగాం

యోగాంధ్రకు సర్వం సన్నద్ధం

విశాఖ సిటీ: యోగాంధ్రకు నగరం ముస్తాబవుతోంది. ఐదు లక్షల మంది యోగాసనాలకు విశాఖ వేదిక అవుతోంది. గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కేందుకు సమాయత్తమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఈ నెల 21వ తేదీన విశాఖ అతిథ్యమిస్తోంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు తరలిరానున్నారు. కాళీమాత ఆలయం నుంచి పార్కు హోటల్‌ వరకు ప్రధాన వేదిక కానుంది. ఇక్కడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, నేవీ అధికారులు, అధికారులు యోగాసనాలు చేయనున్నారు. ఈ రెండు కిలోమీటర్లు మేర ప్రధాన వేదికలో 12 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో వెయ్యి మంది ఉంటారు. ప్రధాన వేదిక తర్వాత సీ1 కంపార్ట్‌మెంట్‌ ఉంటుంది. పార్కు హోటల్‌ వరకు మొత్తం 12 కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. సీ6 వరకు 9 వేల మంది ఇండియన్‌ నేవీ, కోస్ట్‌ గార్డు సిబ్బందితో పాటు, ఇంటర్నేషనల్‌ యోగా స్టూడెంట్స్‌, యోగా అసోసియేషన్‌ సభ్యులు, వివిధ స్థాయిల్లో యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు పాల్గొంటారు. అలాగే సీ7 నుంచి సీ12 వరకు గల కంపార్ట్‌మెంట్లలో సమీపంలోని నివాసితులు భాగస్వామ్యమవుతారు. ఈ ప్రధాన వేదిక వద్ద పాల్గొనే వారి అవసరాలకు అనుగుణంగా 1400 టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రధాన వేదిక ప్రాంతంలో అదనపు కంపార్ట్‌మెంట్లతో కలిపి మొత్తం 15 వేల మంది పాల్గొననున్నారు. ఒక వేళ వర్షం పడితే ఈ ప్రధాన వేదికను ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలోకి మార్చనున్నారు.

● ఆర్కే బీచ్‌ రోడ్‌లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు ఏకకాలంలో 5 లక్షల మంది యోగాసనాలు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

● మొత్తంగా 326 కంపార్టుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక మినహా మిగిలిన కాంపార్ట్‌మెంట్లలో 3.5 లక్షల మందికి చోటు కల్పిస్తున్నారు.

● ప్రజలు కంపార్ట్‌మెంట్లలోకి చేరుకున్న తర్వాత టీషర్టు, క్యూఆర్‌ కోడ్‌ అందజేస్తారు.

● తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, వైద్య సిబ్బందితో పాటు పోలీసులతో పాటు 10 మంది వలంటీర్లు ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో అందుబాటులో ఉంటారు.

● ప్రతి రెండు లేదా మూడు కంపార్ట్‌మెంట్లకు అనుబంధంగా 20 బెడ్లతో కూడిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

● విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు.

● ప్రజలను తరలించేందుకు మొత్తంగా 10,235 ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను వినియోగించనున్నారు.

● అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ద్వారా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏకంగా 22 రికార్డులు దక్కించుకునేందుకు కసరత్తు చేస్తోంది. విశాఖ సముద్ర తీరంలో 11 నావికాదళ నౌకలపై నేవీ అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. ఇది కూడా రికార్డు క్రియేట్‌ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన 25 వేల మంది గిరిజన విద్యార్థులు ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో యోగా చేయనున్నారు. ఇది కూడా రికార్డు నెలకొల్పే అవకాశముంది.

21న విశాఖలో అంతర్జాతీయ

యోగా దినోత్సవం

పాల్గొననున్న ప్రధాని మోదీ

5 లక్షల మందితో యోగాసనాలు

గిన్నిస్‌ రికార్డు కోసం ప్రణాళికలు

మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్న విశాఖ సాగర తీరం

యోగాంధ్రకు సర్వం సన్నద్ధం 1
1/1

యోగాంధ్రకు సర్వం సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement