పాడేరు: గంజాయి రవాణా కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి చోడవరం కోర్టు పదేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి ఆర్. గౌరీశ్వరరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. 2014 సంవత్సరంలో పాడేరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 360 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐషర్ వ్యాన్‌ను అధికారులు పట్టుకున్నారు. రాజమండ్రికి చెందిన నాయుడు శ్రీనివాస్ (30) అనే వ్యక్తిని ఏ2 నిందితుడిగా గుర్తించి అప్పట్లోనే రిమాండ్‌కు తరలించారు. అప్పటి ఎకై ్సజ్ ఎస్‌ఐలు డి. గంగాధర్, ఎం. జ్ఞానేశ్వరి పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత ఇన్‌స్పెక్టర్ ఆచారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.హెచ్. సూర్యనారాయణ ఫోరెన్సిక్ నివేదికలు, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన చోడవరం 9వ అదనపు కోర్టు న్యాయమూర్తి ఎం. హరినారాయణ, నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ తుది తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ అధికారి గౌరీశ్వరరావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, కఠిన శిక్షలు పడేలా రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి గౌరీశ్వరరావు


