ఆర్డీవో లోకేశ్వరరావు
హుకుంపేట: విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో లోకేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని ములియపుట్టు సచివాలయాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈ సమయంలో డిజిటల్ అసిస్టెంట్,వెల్ఫేర్ అసిస్టెంట్ మినహా మిగతా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హుకుంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. వీఆర్వోలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజెషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసరావు,ఆర్‌ఐ సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.


