15 నుంచి బోడకొండమ్మ ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

15 నుంచి బోడకొండమ్మ ఉత్సవాలు

Mar 10 2026 7:28 AM | Updated on Mar 10 2026 7:28 AM

గూడెంకొత్తవీఽధి: గూడెం కాలనీలో ఈనెల 15 నుంచి 17 వరకు బోడకొండమ్మ శాంభవి దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఉత్సవాల నిర్వాహకుడు పసుపులేటి వినాయకరావు తెలిపారు. ఆలయం వద్ద సోమవారం ఉత్సవాల వాల్‌పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు,కోలాటం ప్రదర్శించనున్నట్టు చెప్పారు. ఉత్సవం చివరిరోజు భారీ ఎత్తున అన్న సమరాధన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడెం–1 ఎంపీటీసీ రాజులమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement