అనంతగిరి(అరకులోయటౌన్): జిల్లాలోఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతున్న గ్లకోమా వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ టి.విశ్వేశ్వర నాయుడు అన్నారు. అనంతగిరి మండలంలో అనంతగిరి, లంగుపర్తి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు కాశీపట్నం వెల్‌నెస్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన శిబిరాల్లో 119 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరిలో 24 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీకి సిఫారసు చేసినట్టు చెప్పారు. 55 మందిని శస్త్ర చికిత్సల కోసం విజయ నగరం పుష్పగిరి కంటి ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.


