ఉపాధ్యాయుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ధర్నా

Feb 14 2026 7:51 AM | Updated on Feb 14 2026 7:51 AM

ఉపాధ్యాయుల ధర్నా

ఉపాధ్యాయుల ధర్నా

తుమ్మపాల: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఐ.వి.రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్‌ రద్దు చేసి, ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్‌ నియామకం చేపట్టాలని, మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పరదేశి, రాష్ట్ర కౌన్సిలర్‌ పి.గంగాధర్‌, ఉపాధ్యక్షుడు ఉదయ భాస్కర్‌,మహిళా అధ్యక్షురాలు సునీత, అసోసియేట్‌ అఽధ్యక్షుడు భాస్కర్‌, ఎలమంచిలి బాధ్యులు రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement