రక్తదానంతో ప్రాణదానం
సాక్షి, పాడేరు: హుకుంపేట, పాడేరు మండలాల సహాయ గిరిజన సంక్షేమ అధికారి(ఏటీడబ్ల్యువో) రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ సోమవారం హుకుంపేట మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ శిబిరానికి స్వచ్ఛందంగా హాజరైన ఏటీడబ్ల్యూవో అఖిల రెండవ సారి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదాన శిబిరాలకు యువతి, యువకులంతా ముందుకు వచ్చి తోటి మనుషులకు ప్రాణదాతలు కావాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోను గర్భిణులు, బాలింతలు, సికిల్‌సెల్ ఎనిమియా కేసులకు రక్తం అవసరాలు అఽధికమయ్యాయని, ఈ మేరకు రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ శిబిరంలో 8 మంది రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు గంగరాజు, వెంకట్, న్యాయవాది తమర్భ ప్రసాద్‌నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.


